calender_icon.png 12 January, 2026 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటాన్ చెరులో గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

12-01-2026 11:40:49 AM

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పటాన్ చెరు శివారు ఔటర్ రింగ్ రోడ్డులోని ముత్తంగి ఎగ్జిట్ వద్ద సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దు నుండి మహారాష్ట్రకు కారులో తరలిస్తున్న 93 కిలోల ఎండు గంజాయిని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రూ. 11,000 నగదు, మొబైల్ ఫోన్లు, రవాణాకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. సోలాపుర్ కు చెందిన సచిన్ గంగారాం, మహేష్, విజయ్ అనే ముగ్గురు మాదకద్రవ్యాల వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.