12-01-2026 11:10:00 AM
అభివృద్ధి, సంక్షేమమే మా ప్రభుత్వానికి ముఖ్యం.
పేదల మంచి కోసం ఈ ప్రభుత్వం ముందుంటుంది.
రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తోంది
హైదరాబాద్: కూకట్‌పల్లి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల(Kukatpally Sub-Registrar's Office) సముదాయానికి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Etela Rajender), ఎమ్మెల్యే కృష్ణరావు, ఎమ్మెల్సీ నవీన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ... కూకట్ పల్లిలో నూతన రిజిస్ట్రార్ కార్యాలయం శంకుస్థాపన చేయడం శుభపరిణామం అన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తోందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇచ్చేలా ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేర్కొన్నారు. డడ్బే ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాదు.. అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని తెలిపారు. పేదలకు మంచి చేసేది ఏ పనికైనా ఈ ప్రభుత్వం ముందుంటుందని హామీ ఇచ్చారు.