12-01-2026 09:57:44 AM
ఎలమంచి తండా సర్పంచ్ బద్రు నాయక్.
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం ఎలమంచిలి తండా సర్పంచ్ గ్రామ పరిశుభ్రతె నా లక్ష్యం అని అన్నారు. సోమవారం స్థానిక ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల తోటి గత కొన్ని సంవత్సరాలుగా మూలకే పరిమితమైన గ్రామపంచాయతీ ట్రాక్టర్ను తన సొంత ఖర్చుతో రిపేరు చేయించి గ్రామాల్లో చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. ప్రతిరోజు గ్రామంలో ఉదయాన్నే ట్రాక్టర్ తోటి తప్పనిసరిగా చెత్త సేకరించి డంపింగ్ యార్డులో దిగుమతి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోక్య నాయక్, హరి నాయక్, భీమా నాయక్, రవి ,అనిల్ ,నాగు, రమేష్, బానోతు హరి,బహుసింగ్, లింగ ,మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు.