12-01-2026 11:58:01 AM
న్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాట కేసు(Karur Stampede Case) సంబంధించి టీవీకే అధినేత(TVK chief Vijay), సినీ నటుడు విజయ్ సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్ లో విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన విషయం తెలిసిందే. విజయ్ కు భద్రత కల్పించాలని జాతీయ రాజధానిలోని పోలీసు అధికారులను కోరినట్లు ఆయన పార్టీ తెలిపింది. ఆయనకు జారీ చేసిన సమన్లకు కట్టుబడి, విజయ్ విచారణ నిమిత్తం సీబీఐ ప్రధాన కార్యాలయంలో అధికారుల ముందు హాజరయ్యారు. కొనసాగుతున్న దర్యాప్తునకు టీవీకే పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని కూడా వారు పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు చార్టర్డ్ విమానంలో విజయ్ వచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి.