04-01-2026 11:06:41 AM
యూఎస్ అదుపులో మదురో..
మదురోతో పాటు ఆయన భార్య
వెనిజులా రాజధానిలో సైనిక ఆపరేషన్ చేశాం..
మదురోను, ఆయన భార్యను నిర్బంధించామన్న ట్రంప్
వాషింగ్టన్: వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య ఫ్లోరెస్ ను అమెరికా ఆధీనంలోకి తీసుకుంది. యూఎస్ ఆర్మీ డెల్టాఫోర్స్(US Army Delta Force) ఆధ్వర్యంలో 30 నిమిషాల్లోనే ఆపరేషన్ ముగించారు. అమెరికా స్పెషల్ ఫోర్సెస్ వారిని న్యూయార్క్ కు తరలించారు. సోమవారం న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఆర్మీ ప్రవేశపెట్టనుంది. అధికారులు మదురోపై నార్కో టెర్రరిజం అభియోగాలు(Narcoterrorism charges) నమోదు చేశారు.
వెనెజులాను తాత్కాలికంగా తామే పాలిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రకటించారు. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్(Delcy Rodríguez) నియామకం అయ్యారు. డెల్సీ రోడ్రిగ్స్ ప్రస్తుతం వెనెజువెలా ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. డెల్సీని తాత్కాలిక అధ్యక్షురాలి నియామిస్తూ వెనెజువెలా సుప్రీంకోర్టు ప్రకటన చేసింది. నిన్న వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను అమెరికా బంధీగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే.