calender_icon.png 6 January, 2026 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గగనపు వనిలో నారింజ

04-01-2026 12:47:32 AM

న్యూఢిల్లీ: కొత్త ఏడాది ఆరంభం సూపర్‌మూన్‌ను తీసుకొచ్చింది. చందమామ శనివారం రాత్రి ఆకాశ వీధిలో మునుపటికంటే పెద్ద పరిణామంలో దర్శనమిచ్చి కనువిందు చేశాడు. మరిన్ని వెలుగులు పంచుతూ ఖగోళ ప్రేమికుల మనసులు దోచాడు. ‘వోల్ఫ్ మూన్’ గా పిలిచే ఈ చందమామ సాధారణం కంటే 14 శాతం పెద్దగా కనిపించాడు. 

సాధారణం కంటే ౩౦ శాతం ఎక్కువ కాంతులు విరజిమ్మాడు. నారింజ రంగును సంతరించుకున్నాడు. చంద్రుడు తన కక్ష్య నుంచి భూమికి అత్యంత సమీపంలోకి రావడం వల్లనే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఈ అందమైన చంద‘మాము’ను చూసేందుకు యావత్ దేశం ఆసక్తి కనబరిచింది. చంద్రుని అందమైన దృశ్యాలను బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. ఔత్సాహికులు తీసిన నిండు చంద్రుని చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.