ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం
48 గంటల్లో హోర్ముజ్ తెరవాలని ఇరాన్‌కు హుకుం
- లేదంటే.. విద్యుత్ ప్లాంట్లను పేల్చివేస్తామని హెచ్చరిక
- హెచ్చరికలను కొట్టిపడేసిన ఇరాన్
- మా శత్రుదేశాల నౌకలకు నో ఛాన్స్.. అంటూ కౌంటర్
- జలసంధి జోలికి వస్తే గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తామని స్పష్టీకరణ.. అమెరికన్ సైనిక స్థావరాలను నేలమట్టం చేస్తామని హెచ్చరికలు
* 48 గంటల్లో హోర్ముజ్ జలసంధిని బేషరతుగా తెరిచి, చమురు, ఎల్పీజీ నౌకల రాకపోకలకు క్లియరెన్స్ ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. లేదంటే.. ఇరాన్‌లోని పెద్ద పవర్ ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపిస్తామని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆది వారం ట్రంప్ తన ట్రూత్ సోషల్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ ఏమాత్రం జడవలేదు.. సరికదా.. తిరిగి ఆయనకు కౌంటర్ ఇచ్చింది.
తమ శత్రుదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు తప్ప, మిగిలిన అన్ని దేశాల నౌకలను వదిలేస్తామని ప్రకటించింది. శత్రు దేశాలకు చెందిన ఒక్క నౌక నుంచి ఒక్క చుక్క చమురైనా బయటకు వెళ్లదని తేల్చిచెప్పింది. ఇరాన్‌లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై అమెరికన్ దళాలు శనివారం వైమానిక దాడులు చేయగా, అందుకు ప్రతీకారంగా ఇరాన్ కూడా ఆదివారం ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేసింది. లిటిల్ ఇండియాగా పేరున్న డిమోనా నగరంపై బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించింది.
వాటిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ రక్ష ణ వ్యవస్థలు విఫలమయ్యాయి. దీంతో అనేక భవన సముదాయాల్లో పేలుళ్లు సంభవించాయి. దాడుల తీవ్రతకు కొన్ని భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో 100 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వీరిలో 10 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అక్కడి యంత్రాంగం వెల్లడించింది. అలాగే, డిమోనాలోని అణు పరిశోధనా కేంద్రం సమీపంలో క్షిపణి పడి భారీ గొయ్యి ఏర్పడింది. అణు పరిశోధనా కేంద్రానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని, రేడియోధార్మిక వాయువులు కూడా విడుదల కాలేదని ఇజ్రాయెల్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ స్పష్టం చేసింది.
వాషింగ్టన్ డీసీ/టెహ్రాన్, మార్చి 22: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాల్సిందేనని డెడ్‌లైన్ విధించారు. లేదంటే ఇరాన్‌లోని అతిపెద్ద పవర్ ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు.
ఇప్పటి నుంచి సరిగ్గా 48 గంటల్లోగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయాలని, ఈ క్రమంలో ఎలాంటి కండీషన్స్, బెదిరింపులకు పాల్పడకూడదని, దాన్ని పూర్తిగా తె రవకుంటే.. ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లను అమెరికా లక్ష్యంగా చేసుకుంటుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వాటిని పూర్తిగా నాశసం చేస్తామని, ముందుగా.. అన్నింటికంటే అతిపెద్ద విద్యుత్ కేంద్రంతో ఈ దాడులు ప్రారంభిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.




