హోర్ముజ్ జలసంధి ఓపెన్
- భారత్ కోసం ఇరాన్ నిర్ణయం
త్వరలోనే వివిధ దేశాల నుంచి మరిన్ని ఎల్‌పీజీ కంటైనర్లు
ఫర్టిలైజర్ ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం లేదు
యుద్ధ పరిస్థితులను రాజకీయ అస్త్రంగా ప్రతిపక్షాలు మార్చుకునే కుట్ర: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : హోర్ముజ్ జలసంధిని భారత్ కోసం తెరిచే ఉంచుతామని ఇరాన్ స్పష్టం చేసిందని, భారత్ జెండా ఉన్న నౌకలను ఆపబోమం టూ ఇరాన్ పునరుద్ఘాటించిందని, దీన్నిబట్టి అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతోందని కేంద్రమం త్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇది మోదీ ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాలు, విదేశాంగ విధా నం ద్వారా భారతదేశానికి దక్కుతున్న గౌరవానికి ఒక నిదర్శనమన్నారు.
వినియోగదా రులకు ఇబ్బందులు కలగకుండా వివిధ దేశాల నుంచి ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) కంటైనర్లు త్వరలోనే భారత్‌కు చేరనున్నాయన్నారు. పశ్చిమాసియా లో నెలకొన్న పరిస్థితులు, భారత్ స్థితిగులపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి గురువారం స్పందిస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ఎల్పీజీ సరఫరాలో తలెత్తుతున్న సమస్యల నేపథ్యంలో..
గృహ వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా.. ఆయిల్ రిఫైనరీలు అదనంగా 25 శాతం ఉత్పత్తిని పెంచా యని పేర్కొన్నారు. ప్రస్తుతానికి దేశీయంగా ఫర్టిలైజర్ ఉత్పత్తిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదని, దీనికితోడు, ఫర్టిలైజర్ ప్లాం ట్లకు అవసరమైన నేచురల్ గ్యాస్ సరఫరా చేయడానికి మంత్రిత్వశాఖ ప్రాధాన్యత కల్పించిందని తెలిపారు.
కాగా గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని, కాంగ్రెస్ నా యకుల అవినీతి, అధిక ధరలు, ఉగ్రవాదం, హంకారపూరితమైన పాలన కారణంగా భారతదేశం బలహీనమైన ఆర్థిక పరిస్థితి దేశాల సరసన చేరిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడే కనీసం ముందుజాగ్రత్త లేకుండా.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన యూపీఏ ప్రభు త్వ హయాంలో.. ఇప్పుడున్నట్లు పశ్చిమాసియాలో యుద్ధం జరిగి తీవ్ర ఉద్రిక్తతలు ఉం టే.. మన దేశంలో నాడు పరిస్థితులు ఎలా ఉండేవో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోందన్నారు.
యుద్ధ సమయంలోనూ భారత్ దృఢంగా
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో భారత్ దృఢంగా ఉంటూ, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ దేశ ప్రయోజనాలను కాపాడుకుంటూ వస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో విదేశాల్లోని ప్రతి భారతీయుడి భద్రతకు భంగం వాటిల్లకుండా, వారికి అండగా నిలబడి ధైర్యాన్నిస్తోందని తెలిపారు. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ నివసిస్తున్న సుమారు 90 లక్షల భారతీయుల భద్రత మోదీ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ప్రస్తుత పరిస్థితుల్లో గల్ఫ్ దేశాల్లోని భారతీయుల విషయంలో ‘మల్టీ వెక్టార్ డిప్లమసీ’ విధానం ద్వారా ముందుకు వెళ్తున్నామన్నారు.
ఈ సంక్షోభాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకునేం దుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఒకప్పుడు పెట్రోల్ బంకులను మూసేయాలని ఉచిత సలహాలు ఇచ్చిన వారే.. ఇవాళ దేశంలో పెట్రో ఉత్పత్తుల కొరత ఉందని ప్రజల్లో గందరగోళం సృష్టించి రాజకీయ పబ్బం గడిపేందుకు ప్రయత్నిస్తుండటం సిగ్గు చేటన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు, ప్రభుత్వానికి అండగా ఉంటూ ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలన్న బాధ్యతను మరిచి.. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ లేనిపోని భయాలను సృ ష్టించడం దారుణమన్నారు.
దేశ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి.. కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్ దందా పెరిగే విధంగా వ్యవహరిస్తుండటం దుర్మార్గమన్నారు. భారత్‌కు ఒకప్పుడు 27 దేశాలు ముడి చమురు సరఫరా చేసేవి.. కానీ ఇప్పుడు మనకు ముడిచమురు 40 దేశాల నుంచి దిగుమతి అవుతోందని, దక్షిణ అమెరికా వంటి ప్రాంతాల నుంచి కూడా ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. దీంతో అంతర్జాతీయంగా నెలకొనే పరిస్థితులు మన దేశ ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం కలిగించకుండా ప్రయత్నాలను కేంద్రం చేస్తోందన్నారు.
విశాఖపట్నం, మంగళూరు, పదూర్ ప్రాంతాల్లో భారీ భూగర్భ స్ట్రాటజిక్ పెట్రోలియం నిల్వలున్నాయని, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా.. తదనుగుణంగా.. ఈ నిల్వలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతానికి భారత్‌లో దాదాపు 74 రోజుల వరకు అవసరమైన పెట్రోలియం నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. మన దేశ వాణిజ్య నౌకలపై ఎలాంటి దాడిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, ఈ విషయం లో జీరో టోలరెన్స్’తో ముందుకు వెళ్తున్నామని, సముద్ర రవాణా రంగంలో పనిచే స్తున్న భారతీయుల భద్రత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.




