20-05-2025 08:05:33 AM
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)తో అమెరికా అధ్యక్షఉడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చర్చించారు. పుతిన్ తో ఫోన్ సంభాషణ అద్భుతంగా జరిగిందని ట్రంప్ వెల్లడించారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా-ఉక్రెయిన్ చర్చలు ప్రారంభించాయని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. షరతులను ఇరు దేశాలే నిర్ణయించుకుంటాయని ట్రంప్ స్పష్టం చేశారు.
యుద్ధం ముగిశాక అమెరికా-రష్యా మధ్య పెద్ద ఎత్తున వాణిజ్య ఒప్పందం(US-Russia Trade Agreement) జరుగుతోందని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ తో యుద్దాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ పేర్కొన్నారు. శాంతియుత ఒప్పందాన్ని తాము అనుకూలమని ట్రంప్ సూచించారు. రాజీ అంశాలు రెండు దేశాలకూ ఉపయుక్తంగా ఉండాలని డొనాల్డ్ ట్రంప్ వివరించారు. తొలుత పుతిన్(Putin)తో రెండు గంటలకుపైగా ట్రంప్ ఫోన్ లో చర్చలు జరిపారు. అనంతరం జెలెన్ స్కీ, యూరోపియన్ యూనియన్ నేతలతో ట్రంప్ చర్చించారు.