ద్రౌపది2లో తుగ్లక్
ఈ సినిమాలో రిచర్డ్ రిషి హీరోగా, రక్షణ ఇందుసుదన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నట్టి నటరాజ్ కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ‘ద్రౌపది2’. మోహన్ జీ దర్శకత్వంలో హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను జీఎం ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి నేతాజీ ప్రొడక్షన్స్ అధినేత చోళ చక్రవర్తి నిర్మించారు. ఇంకా ఈవైజీ మహేంద్రన్, నడోడిగల్ బరాణి, సరవణ సుబ్బయ్య, వెల్ రామమూర్తి, సిరాజ్ జానీ, దినేశ్ లాంబా, గణేశ్ గౌరాంగ్, దివి, దేవయాని శర్మ, అరుణోదయన్ ఇతర పాత్రల్లో అలరించనున్నారు. 14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశపు నేపథ్యంలో సాగే కథతో రూపుదిద్దుకున్న.
ఈ చిత్రంలో చిరాగ్ జానీ విలన్‌గా నటిస్తున్నారంటూ మేకర్స్ చేసిన తాజా ప్రకటనతో అంచనాలు మరోస్థాయికి చేరాయి. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహన్ జీ మాట్లాడుతూ.. “మహమ్మద్ బిన్ తుగ్లక్ పాత్రలో చిరాగ్ నటించారు. చరిత్రలో తుగ్లక్‌ను తెలివైన మూర్ఖుడు అని అంటుంటారు. ఇలాంటి పాత్రను చేయాలంటే లుక్ పరంగా గంభీరంగా కనిపిస్తూనే మేథస్సు, తెలివిని బ్యాలెన్స్ చేస్తూ నటించే యాక్టర్ కావాలి.
ఇలాంటి వేరియేషన్స్‌ను చూపించటం చాలా కష్టంతో కూడుకున్నది. చిరాగ్ ఆ పాత్రలో పూర్తిగా లీనమై, అన్నిరకాల భావోద్వేగాలను అద్భుతంగా పలికించారు” అని పేర్కొన్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి ఫిలిప్ ఆర్ సుందర్ సినిమాటోగ్రఫీ అందించగా, గిబ్రాన్ సంగీతాన్ని అందించారు. ఎడిటర్‌గా దేవరాజ్, ప్రొడక్షన్ డిజైనర్‌గా కమల్‌నాథన్ బాధ్యతలను నిర్వహించారు.




