03-01-2026 12:00:00 AM
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. షైన్‌స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక కాగా విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ కేథరిన్ టెస్రా ప్రత్యేక పాత్ర లో కనిపించనుంది.
సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ పండగ బొమ్మ అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు చిత్రబృందం శుభవార్త చెప్పింది. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని శుక్రవారం ప్రకటించారు. జనవరి 4న ట్రైలర్ విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ విడుదల చేసిన ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో చిరంజీవి యాక్షన్ లుక్ అదిరిపోయింది.
హై-వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్‌తోపాటు క్రైమ్ డ్రామా షేడ్స్ కలిగిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని హింట్స్ ఇస్తోందీ లుక్. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రాఫర్‌గా సమీర్‌రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్‌గా ఏఎస్ ప్రకాశ్ వ్యవహరిస్తున్నారు.