రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది
బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి) : సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని, రాష్ట్ర మంత్రులంతా డమ్మీగా మారారని బీఆర్ ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ విమర్శించారు. మం త్రులు ఏది అడిగినా తమకు తెలియదు, సంబంధం లేదని సమా ధానం చెబుతున్నారని, అసలు రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హోం మంత్రి అనుమతి లేకుండా హైదరాబాద్‌లో వ్యాపార సముదాయాలపై ఆంక్షలు, అబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెలియకుండానే సోమ్ డిస్టిలరీస్‌కు అనుమతులు, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సమాచారం లేకుండా ఆర్టీసీలో ఈ టికెట్ మిషన్ల కొనుగోళ్లు చేపట్టడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నకిలీ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ అక్రమాలపై కోర్టుకు వెళ్లుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనపై ఇప్పటికే బీఆర్‌ఎస్ బ్లాక్, రెడ్, గ్రీన్ బుక్స్ సిద్ధం చేసిందన్నారు.






