పీవీ.. మహా మేధావి
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి) : బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి మాజీ ప్రధాని పివీ నరసింహారావు అని బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశే ఖర్‌రావు కీర్తించారు. శుక్రవారం పీవీ 103 జయంతి సందర్భంగా దేశానికి ఆమర అం దించిన సేవలను కొనియాడారు. నాటి ప్ర పంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సం స్కరణలు చేపట్టి దేశ ఆర్ధిక స్థితిని చక్కదిద్దిన దార్మనికుడు, భారతజాతి ముద్దుబిడ్డ పీవి అని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డగా మనమందరం గర్వపడాల్సిన పీవీ అందించిన స్ఫూర్తి మరువలేదనిదన్నారు. మౌనమునిగా పేరుగాంచిన పీవీ దేశానికి ఎనలేని సేవలు అందించినప్పటికీ కాంగ్రెస్ పాలకులు విస్మరించారని విమర్శించారు. తెలం గాణ ఆవిర్భావం అనంతరం బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆయనకు సముచిత గౌరవం ఇచ్చిందని పేర్కొన్నారు.






