10 March, 2026 | 6:31 AM

పసుపు పంటకు.. మార్కెట్ ఏది?

09-03-2026 01:39 AM

నిర్మల్ జిల్లాలో 10,000 ఎకరాల్లో సాగు 

అమ్ముకోవాలంటే 100 కి.మీ వెళ్లాల్సిందే

జిల్లాలో పసుపు రైతులకు తప్పని కష్టాలు..

లక్ష్మణ్ చందా, మార్చి 8 (విజయక్రాంతి): రైతు ఇల్లు కట్టాలన్న... పెళ్లి చేయాలన్న. పసుపు పంట పండితే చాలు. ఇవి రెండు చేయవచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా. పసుపు పంటను నమ్ముకొని సాగు చేస్తున్న రైతులకు పంట అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు. నిర్మల్ జిల్లాలో లక్ష్మణ చందా, మామడ, సారంగాపూర్ సోన్ దిల్వార్పూర్ లోకేశ్వరం కుంటాల నరసాపూర్ కడెం ఖానాపూర్ పెంబి దస్తురాబాద్ తదితర మండలంలో రైతులు సంప్రదాయ పంటగా పసుపును సాగు చేస్తారు.

జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 10,000 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. వాణిజ్య పంటగా మార్కెట్లో పసుపుకు డిమాండ్ ఉంటుందన్న ఆశతో రైతులు తమకున్న కొద్దిపాటి భూమి లో పసుపు పంటకి ప్రాధనంత ఇస్తారు. పసుపు పంటకాలం 180 రోజులు. ఇతర పంటలతో పోలిస్తే పసుపు పంటకు పెట్టుబడులు కూడా ఎక్కువ. నిర్మల్ జిల్లాలో జూన్ జూలై మాసంలో పసుపును సాగు చేస్తున్న రైతులు అంతర్ పంటగా మొక్కజొన్నలు కూడా వేసుకుంటారు. మొక్కజొన్న 100 రోజుల్లో దిగుబడి రాగా ఆ తర్వాత పసుపు 150 రోజుల తర్వాత పంట చేతికి వస్తుంది.

ఒక ఎకరానికి 60 నుంచి 80 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. విత్తనం ఎరువులు కలుపుతీత రసాయన మందులు ఇలా పెట్టుబడులు ఎక్కువైనప్పటికీ దిగుబడి ఎకరానికి 20 క్విం టాళ్ల వరకు వస్తుందని రైతులు పేర్కొంటున్నా రు. మార్కెట్లో ప్రస్తుతం పసుపుకు 14000 వరకు ధర పలుకుతుంది. గత ఏడాది పసుపు కు 9000 నుంచి 10000 ధర ఉండగా ఈ సారి ధర పెరగడంతో తమకు కలిసి వస్తుంద ని జిల్లా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో పసుపు పంటను సాగు చేస్తున్న రైతులు కొమ్ములను ఉడకబెట్టి ఆరబెట్టి కొమ్ముమండా వేరే చేసి మార్కెట్ తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

అమ్ముకోవడానికి అవస్థ 

నిర్మల్ జిల్లాలో పసుపు పంటను సాగుచేసిన రైతులు పంటలు వికరించుకోవడానికి అవస్థలు పడుతున్నారు. నిర్మల్ జిల్లాలో నిర్మల్ బైసా కుబీర్ ఖానాపూర్ సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్న బైంసాక్ ఖానాపూర్ లో మాత్రమే పసుపు కొనుగోలు నవమాత్రంగా నిర్వహిస్తారు. అయితే రైతులు మాత్రం మద్దతు ధర కోసం నిజామాబాద్ మహారాష్ట్రలోని బోకర్ ధర్మాబాద్ సాంగ్లీ తదితర ప్రాంతాలకు పసుపును తరలించి అక్కడ విక్రయిస్తున్నారు.

ఈ మార్కెట్లు నిర్మల్ జిల్లా నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉండడంతో పంటను రవాణా చేసేందుకు ప్రమాణ చార్జీలు భరించవలసి వస్తుంది. నిర్మల్ జిల్లాలో మార్కెట్లు ఏర్పాటు చేసి పంట కొనుగోలు మద్దతు ధర చెల్లిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని పసుపు రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నిజాంబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డును ఏర్పాటు చేసి పసుపు కొనుగోలను చేపడుతుంది.

అయితే నిర్మల్ జగిత్యాల కరీంనగర్ కామారెడ్డి తదిత ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పసుపును నిజాంబాద్ మార్కెట్ తరలిస్తున్నారు. దీంతో నిల్వలు పెరగగా కొన్ని సందర్భాల్లో పసుపు వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి ధరలను తగ్గిస్తున్నారని అంటున్నారు. పసుపుంటను విక్రయించేందుకు నిజాంబాద్ మార్కెట్ కు వెళ్లవలసిన రావడంతో రైతుల సమయం కూడా వృధా అవుతుంది. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా నిర్మల్ జిల్లాలో పసుపు పంట కొనుగోలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి:

సర్కార్ కక్కుర్తి!

వనపర్తికి కేంద్రియ విద్యాలయం

ప్రమాదం అంచునలో లెవెల్ బ్రిడ్జి..