calender_icon.png 22 June, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్వాదశ రాశిఫలాలు

22-06-2025 12:00:00 AM

22.-6--.2025 నుంచి 28.-6.-2025 వరకు

రామడుగు రంగన్న సిద్ధాంతి

మేషం

ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. అశాంతిగా ఉంటారు. కొన్ని ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ధన విషయక ఇబ్బందులు కలుగుతాయి. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు వివాహ నిశ్చయాలు జాప్యం అవుతాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు మేలు జరుగుతుంది. రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారికి 30 శాతం అనుకూలత, 70 శాతం ప్రతికూలత ఉంది. 

వృషభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. సంతోషకర వార్తలు వింటారు. చేసే పనులు విజయవంతం అవుతాయి. శుభకార్యాలు చేస్తారు. సంతృప్తికరంగా ఉంటారు. ధనలాభాలు కలుగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి పెండ్లి సంబంధాలు దొరుకుతాయి. వ్యాపారస్తులు అధికలాభాలు పొందుతారు. విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 80 శాతం అనుకూలత, 20 శాతం ప్రతికూలత ఉంది. 

మిథునం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. వృత్తి పరమైన సమస్యలు కలుగుతాయి. గతంలోకంటే ఎక్కువగా మంచి జరుగుతుంది. అశాంతిగా ఉంటారు. ధనవ్యయమవుతుంది. అకాల భోజనం చేస్తారు. ఇంట్లో బంధువులతో సందడిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

కర్కాటకం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ఆకస్మిక ధనవ్యయం అవుతుంది. పెద్దవారితో పరిచయాలు కలుగుతాయి. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. శుభ కార్యక్రమాలు చేస్తారు. కొందరితో భేదాలు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహాలలో స్తబ్దత ఉంటుంది. విద్యార్థులు ఉత్సాహంగా చదువుతారు. ఉద్యోగస్తులు సంతోషవార్తలు వింటారు. వ్యాపారస్తులకు, రైతులకు చేసే పనులలో లాభం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది. 

సింహం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి చాలా మంచిగా ఉంది. శుభకార్యాలు చేస్తారు. మనసు శాంతిగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. చేసే పనులలో ఫలితం వుంటుంది. ధనవ్యయమవుతుంది. యువ తీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ముందుంటారు. వ్యాపారస్తులకు, రైతులకు లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 70 శాతం అనుకూలత, 30 శాతం ప్రతికూలత ఉంది. 

కన్య

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచి గా ఉంది. ధనలాభం కలుగుతుంది. అభివృద్ధికరమైన పనులు చేస్తారు. శుభవార్తలు వింటారు. కొత్తవారితో పరిచయాలు కలుగుతాయి. సంతోషంగా ఉంటారు. యువతీ యువకులకు ఉద్యోగం, కోరుకున్న వారి తో వివాహ నిశ్చయాలు జరుగుతాయి. విద్యార్థులకు శుభం కలుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు సంతోషం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది. 

తుల

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కుటుంబ వాతావరణం సంతృప్తిగా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు. శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతాయి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభం కలుగుతుంది. బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. చేసే పనులు కలిసి వస్తాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు శ్రమించవలసి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది. 

వృశ్చికం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ఆరోగ్యం దెబ్బ తింటుంది. ప్రయాణాలు చేస్తారు. బంధువులతో భేదం కలుగుతుంది. శుభకార్యాలు చేస్తారు. చేసే పనులలో ఆటంకం ఏర్పడుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం, ఒత్తిడి పెరుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు అనుకూల కాలం కాదు. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది. 

ధనుస్సు

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. కొన్ని విషయాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. మనస్సు శాంతంగా ఉంటుంది. సంస్కారులతో స్నేహం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ధనవ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులలో శ్రద్ధ చూపుతారు. వ్యాపారస్తులు, రైతులు చేసే పనులలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పనిభారం వున్నా ధనలాభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

మకరం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. ఆస్తి విషయక లాభాలు కలుగుతాయి. శుభవార్తలు వింటా రు. ప్రశాంతత ఉంటుంది. ధనవ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉంటుంది.- విద్యార్థులు పట్టుదలతో చదవాలి. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్యలాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది. 

కుంభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. చేసే పనులు పూర్తవుతాయి. శుభవార్తలు వింటారు. స్థిరనిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో మంచిగా ఉంటారు. ధనలాభం కలుగుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఉన్నత పురోగతిని పొందుతారు. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ధనలాభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

మీనం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. శుభకార్యాలు చేస్తారు. మనసు అశాంతిగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బంధువులతో సఖ్యతగా ఉంటారు. ధన వ్యయమవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు చదువులలో శ్రద్ధ ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు స్వల్పలాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది.