ద్వాదశ రాశిఫలాలు
1.-12-.2024 నుంచి 7.-12.-2024 వరకు
రామడుగు రంగన్న సిద్ధాంతి :
మేషం
ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి శుభంగా ఉంది. ధనాదాయం పెరుగుతుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు మంచి పెండ్లి సంబంధాలు దొరుకుతాయి. ఉద్యోగస్తులకు ధన లాభం, ప్రమోషన్లు కలుగుతాయి. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు పదువులలో ఉన్నతిని పొందుతారు. రైతులు ఆనందంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 80 శాతం అనుకూలత, 20 శాతం ప్రతికూలత ఉంది.
వృషభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా లేదు. బంధువుల ఆదరణ లభిస్తుంది. ధనవ్యయం అవుతుంది. మనసు అశాంతిగా ఉంటుంది. యువతీ యువకులకు పెండ్లి విషయాలలో జాప్యం జరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారులతో ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చికాకుగా ఉంటారు. విదేశీ యాన ప్రయత్నాలు ఫలించవు. రైతులకు లాభాలు ఉండవు. -ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. -మొత్తం మీద ఈ రాశివారికి 35 శాతం అనుకూలత, 65 శాతం ప్రతికూలత ఉంది-.
మిథునం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. శుభవార్తలు వింటారు. పనులు మందకొడిగా సాగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. బంధువులు, మిత్రులతో స్పర్ధలు ఏర్పడతాయి. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు ఫలించవు. విద్యార్థులు చదువుల్లో ముందుంటారు. వ్యాపారస్తులు, రైతులు పనులలో జాగ్రత్త పడవలసి ఉంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది.
కర్కాటకం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. పనులలో విజయం లభిస్తుంది. శుభకార్యక్రమాలు చేస్తారు. అందరితో ఆనందంగా ఉంటారు. యువతీ యువకులకు అనుకున్న వారితో వివాహాలు జరుగుతాయి. విద్యార్థులు ఉత్సాహంగా చదువుతారు. ఉద్యోగస్తులకు ధనలాభం కలుగుతుంది. వ్యాపారస్తులు, రైతులకు పనులలో లాభాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారికి 80 శాతం అనుకూలత, 20 శాతం ప్రతికూలత ఉంది.
సింహం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ధనవ్యయం అవుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులకు చదువులలో ఆసక్తి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది.
కన్య
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. సమయస్ఫూర్తితో విజయం సాధిస్తారు. మంచివారితో పరిచయాలు కలుగుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. భూమి, వాహనాలను కొనుకోలు చేస్తారు. ధనలాభ సూచనలు ఉన్నాయి. యువతీ యువకులకు కోరుకున్న వారితో వివాహ నిశ్చయాలు జరుగుతాయి. విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు, రైతులకు సంతోషం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది.
తుల
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఓపిక అవసరం. బంధువులతో మంచిగా ఉంటారు. చేసే పనులలో విజయం కలుగుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు శ్రమించవలసి ఉంటుంది. ఫలితం దక్కుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారస్తులకు, రైతులకు ధనలాభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉన్నది.
వృశ్చికం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్య విషయమై కొంత ఇబ్బందిగా ఉంటుంది. ధనవ్యయం అవుతుంది. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువులలో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
ధనుస్సు
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. దానధర్మాలు చేస్తారు. మంచివారితో స్నేహం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. బంధువులతో సంతోషంగా ఉంటారు. ధనలాభాలు కలుగుతాయి. భూమిని కొంటారు. యువతీ యువకులకు మంచివారితో వివాహం జరుగుతుంది. విద్యార్థులు చదువులలో ఉన్నతిని సాధిస్తారు. వ్యాపారస్తులు, రైతులకు లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది.
మకరం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. శుభకార్యాలు చేస్తారు. ధనవ్యయం అవుతుంది. బంధువులతో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. మానసిక అశాంతి ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. యువతీ యువకులకు వివాహ విషయంలో జాప్యం కలుగుతుంది.- విద్యార్థులకు చదువులలో శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
కుంభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. బంధువులు సహకరిస్తారు. మిత్రులతో విరోధం కలుగుతుంది. ప్రయాణాలు చేస్తారు. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. ధనవ్యయం అవుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలలో స్తబ్దత ఏర్పడుతుంది. విద్యార్థులకు చికాకు, అశ్రద్ధ ఉంటాయి. వ్యాపారస్తులకు, రైతులకు నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
మీనం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. చేసే పనులలో ఆటంకాలు కలుగుతాయి. ధనవ్యయం అవుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో విభేదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. విద్యార్థులు చదువులలో స్తబ్దంగా ఉంటారు. వ్యాపారస్తులకు, రైతులకు కాలం అనుకూలించదు. ఉద్యోగస్తులు అనారోగ్యానికి గురవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.




