08-06-2025 12:03:53 AM
8-.6.-2025 నుంచి 14.6.-2025 వరకు
రామడుగు రంగన్న సిద్ధాంతి :
మేషం
ఈవారంలో ఈ రాశివారికి గ్రహస్థితి మధ్యరకం గా ఉంది. మనస్సు సంతోషంగా ఉండదు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కావు. ఆర్థిక పరిస్థితి బాగుండదు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. శుభవార్త లు వింటారు.యువతీ యువకులకు వివా హ ప్రయత్నాలలో జాప్యం.ఉద్యోగ ప్రయత్నాలలో ఆలస్యం. ఉద్యోగస్తులకు ఒత్తిడి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువులలో శ్రద్ధ చూపరు. రైతులు కష్టపడతారు. ఈ రాశివారికి 25శాతం అనుకూలత, 75శాతం ప్రతికూలత ఉంది.
వృషభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. బంధువులతో సంతోషంగా ఉంటారు. ప్రారంభించిన పనుల్లో విజయం. యువతీ యువకులకు పెండ్లి ప్రయ త్నాలలో శుభం. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు లాభాలు. విద్యార్థులు పట్టుదలతో ఉన్నతి, విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. రైతులకు శుభవార్తలు. పొదుపు అవసరం. -భూసంబంధ సమస్యలు పరిష్కారం. ఈ రాశివారికి 70 శాతం అనుకూలత, 30శాతం ప్రతికూలత.
మిథునం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ధనవ్యయమవుతుంది. బంధుమిత్రులతో విరోధాలు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ వివాహ ప్రయత్నాలలో జాప్యం జరుగుతుంది. విద్యార్థులు శ్రద్ధతో చదవాలి. వ్యాపారస్తులు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు ఒత్తిడిలకు లోనవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది.
కర్కాటకం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి శుభకరంగా ఉంది. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. అనేక మంచి కార్యక్రమాలు చేస్తారు. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాలవల్ల ధన వ్యయం. బంధువులతో ఆనందంగా ఉంటారు. యువతీ యువకులకు అనుకున్నట్లు వివాహాలు జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నా లు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారస్తులకు, రైతులకు శుభకర ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారికి 80 శాతం అనుకూలత, 20 శాతం ప్రతికూలత ఉంది.
సింహం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. ఆత్మీయులతో విరోధాలు కలుగుతాయి. అపవాదులకు లోనవుతా రు. ప్రయాణాలవల్ల అనారోగ్యం కలుగుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తొందరగా ఫలించ వు. విద్యార్థులు చదువులలో ముందుకు వెళతారు. వ్యాపారస్తులకు, రైతులకు అనుకున్న లాభాలు రావు.ఉద్యోగస్తులకు శ్రమ అధికం, ఫలితం స్వల్పం. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.
కన్య
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చేసే ప్రయత్నాలు ఫలి స్తాయి. పూజలు, అన్నదానాలు చేస్తారు. సాధు సత్పురుషులను కలుస్తారు. ఉన్నతమైన వారితో స్నేహం. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. శుభకార్యాలు చేస్తారు. భూమి కొనే అవకాశం ఉంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నా లు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువు, ఉద్యోగాల్లో ఉన్నతి. వ్యాపారస్తులకు, రైతులకు అధిక లాభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది.
తుల
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ధన సంబంధ సమస్యలు పరిష్కారమవుతాయి.పెట్టుబడులకు సరై న సమయం కాదు. బంధువులతో వైరుధ్యాలు. దూర ప్రయాణాల వల్ల అనా రోగ్యం. నిందలకు లోనవుతారు. విద్యార్థులు పట్టుదలతో చదవాలి. ఉద్యోగ స్తుల కు కొంత ఊరట. వ్యాపారస్తులకు, రైతులకు మంచికాలం కాదు. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.
వృశ్చికం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భూసంబంధ కలహాలు ఏర్పడతాయి. కొన్ని శుభకార్యాలు చేస్తారు. ధనవ్యయం అవుతుంది. శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలతో అస్వస్థత. యువతీ యువకులకు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో పురోగతి ఉంది. విద్యార్థు లు ఉన్నత ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు, రైతులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
ధనుస్సు
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ధన వ్యయమవుతుంది. బంధువులతో విరోధాలు. నూతన గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు. బంగారం, వాహనాలు వంటి ఖరీదైన వస్తువులు కొంటారు. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులు, రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు ఒత్తిడులకు లోనవుతారు. ఈ రాశివారికి 35 శాతం అనుకూలత, 65 శాతం ప్రతికూలత ఉంది.
మకరం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. తలచిన పనులు పూర్త వుతాయి. శుభవార్తలు వింటారు. నూత న వాహనయోగం. మంచివారితో పరిచయాలు. యువతీ యువకులకు ఉద్యో గ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులు, రైతులు అనుకూల ఫలితాలు. ఉద్యోగస్తులు సంతోషంగా ఉం టారు. ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.
కుంభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. బంధుమిత్రులతో విరోధాలు సంభవిస్తాయి. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. అశాంతిగా ఉంటుంది. ధనవ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఉన్నత పురోగతిని సాధిస్తారు. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ధనలాభం ఉంది. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది.
మీనం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. బంధువులతో సంతోషంగా గడుపుతారు. చేసే పనులు ఆలస్యమవుతాయి. శుభకార్య నిమిత్తమై ఖర్చులవుతా యి. భూసంబంధ సమస్యలు ఏర్పడతా యి. దూర ప్రయాణాలు చేస్తారు. యువ తీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువుల లో ప్రయత్నశీలురై ఉంటారు. వ్యాపారస్తులకు, రైతులకు స్వల్పలాభాలు. ఉద్యో గస్తులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది.