calender_icon.png 26 January, 2026 | 12:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రజనీ సరసన ఇద్దరు!

26-01-2026 02:39:31 AM

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ చాలాకాలం తర్వాత మళ్ళీ చేతులు కలుపుతుండటంతో ‘తలైవార్176’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘రాజ్ కమల్ ఫిలమ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై కమల్ హాసన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ‘డాన్’ ఫేమ్ శిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.

దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి రోజుకో కొత్త వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తూ సినిమాపై హైప్‌ను రెట్టింపు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఇద్దరు క్రేజీ హీరోయిన్లు పూజా హెగ్దే, ప్రియాంక అరుల్ మోహన్ కీలక పాత్రలు పోషించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రజనీకాంత్ మాస్ ఇమేజ్‌కు తోడు ఈ ఇద్దరు గ్లామరస్ భామల ఎంట్రీ ఉండటంతో కాంబో అదరి పోతుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.