10-11-2025 12:00:00 AM
ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆదిలాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందాగా, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.స్థానికుల వివరాలు తెలిపిన ప్రకారం.. ఆదివారం జిల్లా కేంద్రం నుండి వెళుతున్న ఓ బైక్ అంకోలి నుండి వస్తున్న మరో బైక్ అంకోలి గ్రా మ సమీపంలో ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నా యి. ఈ ప్రమాదంలో కచ్ కంటి, దార్లో ద్ది గ్రామాలకు చెందిన ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఐతే తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలిం చారు. కాగా దార్లోద్ది గ్రామానికి చెం దిన తుమ్రం వంశీ (20) అనే యువకుడు తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందారు. మరో ఇద్దరు రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.