calender_icon.png 10 November, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి కొనుగోలు కేంద్రం పరిశీలన

10-11-2025 12:00:00 AM

సూచనలిచ్చిన డీఏవో

బెజ్జూర్, నవంబర్ 9(విజయ క్రాంతి): బెజ్జూర్ మండలం లోని బారెగూడ వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ సందర్శించారు. ఐకెపి  పి పి సి ఎస్  మార్కెటింగ్ స్థలాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, వసతులు కల్పిం చాలని సిబ్బందికి సూచించారు. రైతు లు దళారులను నమ్మి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాలలోనే వరి ధాన్యా న్ని రైతులు విక్రయించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలోని రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఏపిఎం మోహన్ దాస్,సెంటర్ ఇంచార్జ్ రంగయ్య, సిసి సంతోష్, వివో ఏలు ఉన్నారు.