calender_icon.png 4 July, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులో మునిగి ఇద్దరు మృతి

31-10-2024 12:00:58 AM

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 30 (విజయక్రాంతి): చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామ పరిధిలోని అబిద్‌నగర్ లో చోటుచేసుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్, బోడుప్పల్‌లో నివాసం ఉండే శశిధర్, చరణ్ అనే బాలురు దీపావళి పండుగ సందర్భంగా స్వగ్రా మం అబిద్‌నగర్ వెళ్లారు. బుధవారం ఉదయం సరదాగా గ్రామంలోని చెరువులో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించారు. బాలుర మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. మోటకొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.