calender_icon.png 4 July, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి

31-10-2024 12:00:00 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనికి నరేందర్‌రెడ్డి వినతి

కరీంనగర్, అక్టోబర్ 30 (విజయక్రాం తి): రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తనకు మద్దతు ఇవ్వాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావును కోరారు. ఈ మేరకు కరీంనగర్ బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. 34 ఏళ్లుగా రాష్ట్రంలో ఎన్నో విద్యాసంస్థలు నెలకొల్పి వేలాదిమంది విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించానని, శాసనమండలికి పోటీ చేయనున్న తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించి మద్దతు తెలుపాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సహకరిం చాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పాల్గొన్నారు.