25 March, 2026 | 5:53 PM

Breaking News

కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి

17-05-2024 01:54 AM

నర్సాపూర్ మే 16 : విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో చోటు చేసుకుంది. గురువారం ఉసిరికపల్లి గ్రామానికి చెందిన మణెమ్మ(45) ఇంటి ఆవరణలో బట్టలు ఆరెస్తుండగా విద్యుత్ షాక్ వచ్చి మణెమ్మ పడిపోయింది. గమనించిన భానుప్రసాద్ (19) పెద్దమ్మను రక్షించేందుకు విద్యుత్ వైర్లను తొలగించే ప్రయత్నించగా అతనికి కూడా కరెంట్ షాక్ తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇరువురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమా ర్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.