calender_icon.png 2 November, 2025 | 4:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

17-05-2024 01:54:40 AM

మెదక్, మే 16 (విజయక్రాంతి) : వ్యవసాయ పెట్టుబడుల కోసం చేసిన అప్పులు భారంగా మారడంతో మనస్థాపానికి గురై ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన ఎల్లయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయం కోసం రూ. 4లక్షల వరకు అప్పులు చేసినట్లు కుటుంబీకులు తెలిపారు. పంటలు సరిగ్గా పండకపోవడం, చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనస్థాపానికి గురై బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ముందున్న వేప చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికొని దర్యాప్తున చేస్తున్నట్లు తెలిపారు.