calender_icon.png 18 January, 2026 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ కాలనీలో వారాంతపు సంత ప్రారంభం

18-01-2026 07:09:59 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో వారాంతపు సంతను సర్పంచ్ గడ్డం రచన చోటు ప్రారంభించారు. గ్రామస్థుల సౌకర్యార్థం గ్రామంలోనే ప్రతి ఆదివారం వారాంతపు సంతను ఏర్పాటు చేయనున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సంత ద్వారా గ్రామ ప్రజలు నిత్యావసర వస్తువులు సులభంగా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కొండ శ్రీకాంత్, వార్డు సభ్యులు వడ్డేపల్లి రమ, మాందాటి శారద, కొంపల్లి శ్యామ్, బల్ల లక్ష్మీపతి, అక్కెల శ్రీనివాస్, మాటేటి రాజు, మామిడల రమేష్, గాలి వీరేశం, దిడి శ్రీనివాస్, పిసక గురునాథ్, బొగ రంగయ్య, రాచర్ల వేణు, సాదుల భాస్కర్, మదాసు సత్యనారాయణ, గోవిందు నాగయ్య, మెరుగు శేఖర్, గౌడ గణేష్, బైరీ వేణు, సామల ప్రశాంత్, ఎన్నం నరేష్, తాటిపాముల ప్రవీణ్, గంగిశెట్టి నవీన్, గోరింటాల మహేష్, ఎన్నం మధు తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.