17 April, 2026 | 2:34 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

స్థాయికి మించి వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలు

13-06-2025 10:13 PM

డోర్నకల్ లో రెండు ఆరోగ్య కేంద్రాల సీజ్ 

స్థాయికి మించి వైద్యం చేయొద్దు : జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్

మహబూబాబాద్,(విజయక్రాంతి): స్థాయికి మించి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో వైద్యం చేస్తున్న రెండు ప్రథమ చికిత్స కేంద్రాలను జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్ సీజ్ చేశారు. జిల్లా వైద్యాధికారి నేతృత్వంలో వైద్యుల బృందం డోర్నకల్ లోని సర్వర్, మసూద్ అని ఇద్దరు నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేయగా అక్కడ ఎలాంటి అర్హతలు లేకుండా రోగులకు స్టెరాయిడ్ ఇంజక్షన్లు, యాంటీబాటిక్, సెలైన్ బాటిల్స్ ఇచ్చేందుకు ఐవీ స్టాండ్, ఇంతకుముందు వినియోగించిన సెలైన్ బాటిల్లను గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ రెండు ప్రధమ చికిత్స కేంద్రాలను సీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ రెండు ప్రధమ చికిత్స కేంద్రాలపై కనేక ఫిర్యాదులు వచ్చాయని, స్థాయికి మించి వైద్యం చేస్తున్నారు.

ఫలితంగా రోగులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని, మెడికల్ షాపు వెనుక ప్రధమ చికిత్స కేంద్రం నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో దాడులు నిర్వహించామని చెప్పారు. ప్రధమ చికిత్స నిర్వాహకులు తమ పేరు ముందు ‘డాక్టర్’ అని రాసుకోకూడదని, కేవలం ఫస్ట్ ఎయిడ్ సెంటర్, ప్రధమ చికిత్స కేంద్రం అని మాత్రమే రాసుకోవాలని, క్లినిక్, ఆసుపత్రి, నర్సింగ్ హోమ్, మెడికల్ సెంటర్ తదితర పేర్లు ప్రదర్శించ రాదని, స్వయంగా రోగ నిర్ధారణ చేసి మందులు, ఇంజక్షన్లు ఇవ్వడం, ప్రిస్క్రిప్షన్ రాయడం చేయకూడదని హెచ్చరించారు. ఆర్ఎంపీలు ల్యాబ్ నిర్వహణ, బెడ్లు ఏర్పాటు చేయడం, స్కానింగ్ చేయడం, ఇన్ పేషెంట్ వైద్యం చేయడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాస్ మీడియా ఉప అధికారి ప్రసాద్, సిబ్బంది అనిల్, రాకేష్ పాల్గొన్నారు.