calender_icon.png 5 February, 2026 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎద్దు దాడిలో ఇద్దరికి గాయాలు

16-11-2024 01:46:09 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ బజార్ ఏరియాలో శనివారం మధ్యాహ్నం ఎద్దు ఆకస్మికంగా దాడి చేయడంతో మహిళతో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఎద్దు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ దుర్గయ్య అనే వ్యక్తిని హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇదే సంఘటనలు గాయపడ్డ కాంట్రాక్టు కార్మికురాలైన లక్ష్మమ్మ అనే మహిళను స్థానికులు బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.