21 April, 2026 | 8:14 AM

పాఠశాల భవనం కూలి ఇద్దరికీ గాయాలు

07-06-2025 12:00 AM

భైంసా, జూన్ 6 (విజయక్రాంతి): కుబీర్ మండలంలోని అంతర్నీ గ్రామంలో శుక్రవారం ఉదయం పాఠశాల భవనం కూలి ఇద్దరి పిల్లలకు గాయాలయ్యాయి. ఈ పాఠశాలలో రెండు భవనాలున్నగా పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

భవనం కింద ఆటలాడుకుంటున్న అదే గ్రామానికి చెందిన సాయికుమార్ ప్రేమ్ కుమార్ కు గాయాలు కావడంతో వెంటనే వారిని బైంసాస్పత్రికి తరలించారు. పిల్లలు పాఠశాలలో ఆడుకుంటుండగా భవనం కూలిపోగా పిల్లలు ఆడుకునే ప్రదేశంలో పూర్తిగా కూలిపోకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు