17 July, 2026 | 12:47 AM

ప్రమాదాలకు కేరాఫ్ నవభారత్

17-07-2026 12:47 AM

ఆర్టిసి బస్సు ఢీకొని ఇరువురు దుర్మరణం 

భద్రాద్రి కొత్తగూడెం, జులై 16, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని నవభారత్ వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. 

ప్రమాదాలకు నిలయంగా మారిన నవభారత పాఠశాల ప్రాంతం 

పట్టణ పరిధిలోని నవభారత్ పాఠశాల పరిసరాల్లో తరచు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం, సంబంధిత అధికారులు శాశ్వత చర్యలు చేపట్టగా పోవడం స్థానికల్లో తీవ్ర ఆందోళన చోటు చేసుకుంటుంది. విద్యా సంస్థ జాతీయ రహదారి పై ఉండటంతో ఈ ప్రాంతంలో విద్యార్థులు తల్లిదండ్రులు బాద చారుల రాకపోకలు అధికంగా ఉన్నప్పటికీ తగిన భద్రతా చర్యలు లేకపోవడం వల్లనే ప్రమాదాలకు కారణం అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

రోడ్డు ఆక్రమణలే ప్రమాదానే కారణం? 

జాతీయ రహదారికి ఇరువైపులా ఆక్రమణలు చోటుచేసుకుని వ్యాపారాలు కొనసాగించడం వలన తరచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణల వల్ల వాహనదారులకు స్పష్టమైన దృశ్యమానత లేకపోవడం వలనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ 

తరచూ ప్రమాదాలకు నిలయంగా మారిన నవభారత్ పాఠశాల పరిసర ప్రాంతాల్లో తగు రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వేగ పరిమితీబోర్డులు, సీసీ కెమెరాలు, హెచ్చరిక సూచనలు, తగు రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.