దేవరకద్రలో తీవ్ర విషాదం.. కారుపై గోడ కూలి.. ఇద్దరు దుర్మరణం
18-06-2026 10:50 AM
కారుపై గోడ కూలి ఇద్దరు మృతి
దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర(Devarakadra ) మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకంది. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న భవనం గోడ అకస్మాత్తుగా కూలి కారుపై పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. మృతులను సివిల్ ఇంజినీర్ జగన్నాథ్ రెడ్డి, డ్రైవర్ సంతోష్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.






