18 June, 2026 | 11:17 AM

లారీని ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

18-06-2026 09:59 AM

తుర్కపల్లి: మేడ్చల్ - మల్కాజ్‌గిరి(Medchal-Malkajgiri) జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన మేడ్చల్ పరిధిలోని తుర్కపల్లి- మురహరిపల్లి మధ్య చోటుచేసుకుంది. అతివేగంతో దూసుకొచ్చు కారు డివైడర్ ఎక్కి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కారు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్తలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.