29 August, 2026 | 7:20 PM

చెట్టును ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి

12-01-2025 02:46 PM

కౌశంబి: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా(Kaushambi district)లో కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. తెల్లవారుజామున కోఖ్‌రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ధీరజ్ కుష్వాహ (31) శనివారం తన కారులో మనీష్ (26), సంజయ్ (25)తో కలిసి వారణాసికి(varanasi) వెళ్లినట్లు కోఖ్‌రాజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సిబి మౌర్య తెలిపారు. "వారణాసి నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, కోఖ్‌రాజ్ పోలీస్ స్టేషన్ సమీపంలో కారు అదుపు తప్పి, ఆదివారం తెల్లవారుజామున రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది, దీని కారణంగా ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు" అని ఆయన చెప్పారు. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించగా, ధీరజ్, మనీష్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. సంజయ్‌కు చికిత్స కొనసాగుతోందని, రెండు మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించామని పోలీసులు వెల్లడించారు.