28 June, 2026 | 6:56 PM

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర

11-05-2026 09:35 PM

సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని మోహినిపురాలో గల వేంకటేశ్వర స్వామి 51వ బ్రహ్మోత్సవాలు  అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా  సోమవారం స్వామి వారి రథయాత్ర కన్నుల పండువగా సాగింది. మహిళల కోలాటాల మధ్య స్వామివారిని పురవీధులలో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో రథయాత్రలో పాల్గొన్నారు.