11 May, 2026 | 10:14 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం

11-05-2026 09:26 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): రాత్రి ఇంటికి లేటుగా ఎందుకు వస్తున్నావని తండ్రి మందలించడంతో మనస్థాపం చెందిన ఓ కుమారుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళి అదృశ్యమయ్యాడు. బాలాజీనగర్ ముత్తుస్వామికాలనీలో బిస్వకర్మ అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. కుమారుడైన టీకారం బిశ్వకర్మ(20) ఈ నెల 9న రాత్రి ఇంటికి లేటుగా వచ్చాడు.ఎందుకు ఆలస్యంగా ఇంటికి వస్తున్నావని తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన టీకారం బిశ్వకర్మ ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. ఈ మేరకు కుటుంబసభ్యులు జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.