calender_icon.png 14 September, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు బోల్తా.. ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

19-04-2025 08:49:33 AM

హైదరాబాద్: జోగులాంబ గద్వాల(Jogulamba Gadwal) జిల్లాలోని ఇటిక్యాల మండలం వేముల శివారులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను పడి పుల్లారెడ్డి(62), లక్ష్మిసుబ్బమ్మ(52)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి నంద్యాల(Hyderabad to Nandyal) వెళ్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.