6 July, 2026 | 1:08 PM

Breaking News

సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •   ములుగు జిల్లాలో భారీ చోరీ   •   సాయి నగర్ మురికి కాలువ లో ముళ్ళ పొదల తొలగింపు   •  

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు, జవాన్ మృతి

20-03-2025 12:01 PM

బీజాపూర్: సరిహద్దుల్లో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బీజాపూర్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు, ఛత్తీస్‌గఢ్ పోలీసుల డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (District Reserve Guard) యూనిట్‌కు చెందిన ఒక జవాన్ మృతి చెందారని ఒక అధికారి తెలిపారు. బీజాపూర్- దంతేవాడ జిల్లాల సరిహద్దులోని ఆండ్రి అడవుల్లో ఉదయం 7 గంటల ప్రాంతంలో భద్రతా సిబ్బంది సంయుక్తంగా గంగలూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో (బీజాపూర్‌లో) నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. సంఘటనా స్థలం నుండి తుపాకీలు, పేలుడు పదార్థాలతో పాటు ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ కాల్పుల్లో ఒక జవాన్ కూడా మృతి చెందాడని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు.