వేర్వేరు ఘటనలో ఇద్దరు మిస్సింగ్
జిన్నారం కాలనీలో మహిళ, ఉమర్‌ఖాన్ గూడలో వ్యక్తి అదృశ్యం
అబ్దుల్లాపూర్‌మెట్ మే 31 : మహిళా అదృశ్యం అయిన ఘ టన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ ప రిధిలో చోటుచేసుకుం ది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం, వడల చందన (32) భర్త శ్రీనుతో కలిసి అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జిన్నారం కాలనీ నివాస ముంటూ లేడీస్ కార్నర్ షాపు నిర్వహిస్తుంది. మే 13న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు తన స్వగ్రామం నా గర్‌కర్నూల్ జిల్లా మిడ్జల్ మండలం, రాణిపేట గ్రామానికి వెళ్తున్నానని చెప్పి బయలు దేరింది. అప్పటి నుం చి ఆమె ఆచూకీ లభించకపోవడంతో మే 28 కుటుంబ సభ్యులు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేర కు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రమేశ్ నాయక్ తెలిపారు.
వ్యక్తి మిస్సింగ్
మహారాష్ట్రలోని పర్భాని జిల్లా, లింగా గ్రామానికి చెందిన రామేశ్వర్ శివాజీ షిం డే (31) తండ్రి శివాజీ షిం డే బతుకుదెరువు కోసం తెలంగాణ వచ్చాడు. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఉమర్‌ఖాన్‌గూడలో కు టుంబ సభ్యులతో కలిసి నివాసిస్తున్నాడు. రామేశ్వర్ శివాజీ షిండే వా రం రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో గత 28న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లో కుటుంబు సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్పై రమేశ్ నాయక్ తెలిపారు.






