కార్మికుల కృషితోనే ఆర్టీసీ డిపోకు రాబడి
01-06-2024 03:28 AM
గజ్వేల్,మే 31: ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల సమష్టి కృషితోనే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపోకు రాబడి పెరుగుతున్నదని ఆర్టీసీ మె దక్ డిప్యుటీ రీజినల్ మేనేజర్ దైవాదీనం, డిపోమేనేజర్ సురేఖ అన్నారు. శుక్రవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోలో ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు ప్రధానం చేశారు. ఈ సంద ర్భంగా డిప్యూటీ రీజినల్ మేనేజర్ దైవాదీనం మాట్లాడుతూ డ్రైవర్లు, కండక్టర్లు అధికమైలేజీని సాధించడంతో పాటు రాబ డి కూడా అధికంగా వచ్చేటట్లు సమష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం ప్రజ్ఞాపూర్, గజ్వేల్‌లలో నిలిచిపోయిన బస్టాండ్ల ను పనులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో సహాయక మేనేజర్లు బాబునా యక్, జమీల్, ఎంసీ జయకుమార్, డ్రైవర్లు ఎస్‌కె మీరా, బాల్‌రెడ్డి, సలీం, ఆంజనేయు లు, బాలయ్య, కండక్టర్లు పాల్గొన్నారు.






