calender_icon.png 4 February, 2026 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

04-02-2026 12:43:55 AM

ఉప్పల్ ఫిబ్రవరి 3 (విజయక్రాంతి) : అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాచారం సబ్ ఇన్స్పెక్టర్ మైబల్లి తెలిపిన వివరాల ప్రకారం మౌలాలి హౌసింగ్ బోర్డ్ లక్ష్మీనగర్‌లో నివాసం ఉం టున్న తన్నేరు గోపి(19) మల్లాపూర్ వెంకటరమణ కాలనీవాసం ఉంటున్న చంద్ర శేఖర్ ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తన్నాడు.

గత కొంతకాలంగా  సిడోలు గ్రామం బీదర్ జిల్లా కర్ణాటక నుంచి గంజాయి కొనుగోలు చేసి మల్లాపూర్ ఉప్పల్ సూర్య నగర్ ప్రాం తంలో గంజాయి విక్రయిస్తున్న సమాచారం మేరకు సిబ్బందితో మల్లాపూర్ సూర్య నగ ర్ వద్ద మాటువేసి వారిని అదుపులోకి తీ సుకున్నారు. వారి నుండి 104 గ్రాముల గం జాయి స్వాధీన చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.