28 June, 2026 | 2:02 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ఎస్సారెస్పీ కాల్వలో ఇద్దరు గల్లంతు

04-02-2026 01:31 AM
  1. హైదరాబాద్‌కు చెందిన మస్తాన్, సోనుగా గుర్తింపు 
  2. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
  3. హనుమకొండ జిల్లా యాదవ నగర్ కెనాల్ వద్ద ఘటన

హనుమకొండ టౌన్ ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా యాదవ నగర్ ఎస్సారెస్పీ కెనాల్ కాల్వలో ఈతకు వెళ్లిన ఇద్దరి యువకులు మృతి చెందిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన మస్తాన్(17), సోను ( 24) ఇద్దరు యువకులు ఓ పండ్ల వ్యాపారి వద్ద కూలీలుగా పనిచేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం నుంచి చింతగట్టు క్యాంపు కెనాల్ పక్కన పండ్లు అమ్ముకుంటూ, అక్కడే ఉండేవారు. ప్రతిరోజు పండ్ల వ్యర్ధాలను హనుమకొండ యాదవ నగర్ సమీపంలోని కెనాల్ పక్కన వేస్తుండేవారు.

ఈ క్రమంలో మంగళవారం కూడా కుళ్లిన పండ్లతో పాటు చెత్తను కెనాల్ పక్కన పడేయడానికి వెళ్లారు. అనంతరం యాదవ నగర్ ఎస్సార్‌ఎస్పీ కెనాల్‌లో స్నానాలు చేస్తుండగా ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యువకుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.