28 June, 2026 | 3:07 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

ప్రజా సమస్యలే ప్రాధాన్యం

04-02-2026 01:31 AM

మొయినాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): గ్రామాల సమగ్ర అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల సమస్యల పరిష్కారమే మా బాధ్యత‘ అని సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి మడి రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. మొయినాబాద్ మండలం ఖాసీం బౌలి గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తాగునీటి పైప్లైన్ సమస్యకు ఆయన చొరవతో ఎట్టకేలకు మోక్షం లభించింది. సమస్యకు శాశ్వత పరిష్కారం చేశారు.

గత కొంతకాలంగా పైప్లైన్ లీకేజీలు, తక్కువ ఒత్తిడితో నీరు రావడం వంటి కారణాలతో ఖాసీం బౌలి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన రాజేందర్ రెడ్డి, వెంటనే స్పందించి మరమ్మత్తు పనులను పూర్తి చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటికి ఎటువంటి ఆటంకం కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తాం అని ఆయన హామీ నిచ్చారు.

కేవలం నీటి సమస్యే కాకుండా, గ్రామాల్లో నెలకొన్న ప్రతి సమస్యను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తాం. ప్రజల సహకారం ఉంటే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తాం అని చెప్పారు. తమ ఇబ్బందులను అర్థం చేసుకుని, తక్షణమే స్పందించి పైప్లైన్ సమస్యను పరిష్కరించినందుకు ఖాసీం బౌలి గ్రామస్తులు మడి రాజేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ ప్రముఖులు మరియు ప్రజలు పాల్గొన్నారు.