నెహ్రూ హయాంలో ఇద్దరు ప్రధానులు
- కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉండేది
- దీనిపై పోరాడిన శ్యామప్రసాద్ బలయ్యారు
- ఆర్టికల్ 370 రద్దుతో ఆయన ఆశయాన్ని మోదీ నెరవేర్చారు
- ముఖర్జీ వర్ధంతి సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): జవహార్‌లాల్ నెహ్రూ హయాంలో దేశంలో ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు ఉండేవని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి తెలిపారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం కేంద్ర మంత్రి పదవికి రాజీనా మా చేయడంతో పాటు ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకోవడం కోసం ఆయన స్థాపించిన జనసంఫ్‌ు పార్టీ ద్వారా దేశాన్ని ఐక్యంగా ఉంచగలిగామని తెలిపారు.
శ్యామప్రసాద్ వర్ధంతి సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కిషన్‌రెడ్డి నివాళులు అర్పిం చారు. కార్యాలయం ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న ప్పుడు దేశంలో ఆర్టికల్ 370 విధానాన్ని విభేదించి శ్యామప్రసాద్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. అనంతరం భారతీయ జనసంఫ్‌ు పేరుతో రాజకీ య పార్టీ ఏర్పాటు చేసి ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారని తెలిపారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జాతీయ చిహ్నాలు ఉండకూ డదనే నినాదంతో ఆర్టికల్ 370 రద్దు కోసం ఉద్యమించారని చెప్పారు.
అప్పుడు మన దేశానికి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉంటే జమ్ముకశ్మీర్‌కు షేక్ అబ్దుల్లా ప్రధానిగా ఉండేవారని, నాడు దేశంలో మూడు రంగు ల జెండా ఉంటే కశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఉండేదన్నారు. దేశంలో అంబేడ్కర్ రాజ్యాం గం ఉంటే అక్క డ జిన్నా రాజ్యాంగం ఉండేదన్నారు. దానికి వ్యతిరేకంగా పోరాడిన శ్యామప్రసాద్ అరెస్టు అయి జైలులోనే బలిదానం అయ్యారని కిషన్‌రెడ్డి తెలిపారు. నాటి జనసంఘ్ నేటి బీజేపీ అని, దేశ సమగ్రత, సమైక్యత కోసమే తమ పార్టీ పని చేస్తోందని అన్నారు. 75 ఏళ్ల తర్వాత దేశంలో ప్రధాని మోదీ నాయకత్వంలో శ్యామప్రసాద్ లక్ష్యం నెరవేరిం దన్నారు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామన్నారు. శ్యామప్రసాద్ ఎక్కడున్నా మోదీ కి, బీజేపీ నాయకత్వానికి వారి ఆశీస్సులు అందజేస్తారని కిషన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. బీజేపీ కార్యకర్తలు దేశం కోసం ప్రా ణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
లక్ష్మణ్ నివాళి
శ్యామప్రసాద్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కే లక్ష్మణ్ ఘనంగా నివాళి అర్పించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మొక్కను నాటారు.
పార్టీ కార్యాలయంలో బలిదాన్ దివస్
దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ వర్ధంతిని బలిదాన్ దివస్‌గా నిర్వహించుకుంటున్నామని బీజేపీ సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన వర్ధంతి కార్యక్రమంలో నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ముఖర్జీ ఆశయాలను సాధించిన పార్టీగా బీజేపీ నిలుస్తుందన్నారు. ఆ మహనీయుని స్ఫూర్తితో దేశం కోసం బీజేపీ పనిచేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ తమిళనాడు సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నాయకులు విజయ రామారావు, ఎండల లక్ష్మీనారాయణ, ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు.






