30 July, 2026 | 10:43 PM

రెండు నెలలు ఓపిక పట్టండి

24-06-2024 01:27 AM

ఎమ్మెల్యే గంగుల, మేయర్ సునీల్‌రావుతో కేసీఆర్

కరీంనగర్, జూన్ 22(విజయక్రాంతి): కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావుతో పాటు పలువురు కార్పొరేటర్లు ఇతర పార్టీల్లో చేరతారన్న ప్రచారం జరుగుతున్న క్రమంలో వారికి మాజీ సీఎం కేసీఆర్,  బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి పిలుపు వచ్చింది. ఆదివారం ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌కు ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావుతోపాటు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు 12 మంది తరలివెళ్లారు. వారితో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించిన కేసీఆర్ రెండు నెలలు ఓపిక పట్టాలని, మనకు మంచి రోజులు రానున్నాయని దిశినార్దేశం చేసినట్లు తెలిసింది. కేసీర్‌ను కలవడానికి వెళ్లిన విషయాన్ని జిల్లా నేతలు గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేసినప్పటికి వీరి కలయిక బహిర్గతం కావడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది.