15 June, 2026 | 8:39 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

మాదాపూర్‌లో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం

15-10-2025 10:59 PM

ట్యూషన్‌కి వెళ్తానని చెప్పి వెళ్లి తిరిగి రాకపోవడంతో కలకలం..

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): మాదాపూర్‌ ప్రాంతంలో ఇద్దరు తొమ్మిదవ తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. గ్రీన్‌ఫీల్డ్‌ స్కూల్‌లో చదువుతున్న మెడిశెట్టి శ్యామ్‌ సూర్య వెంకటేష్‌(14), రామేశ్వరం సాయి స్వదీప్‌(14) అనే బాలురు ఇద్దరూ సోమవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ట్యూషన్‌కి వెళ్తానని చెప్పి బయటకు వెళ్లి అదృశ్యం వివరాల ప్రకారం వెంకటేష్‌ అక్టోబర్‌ 14న సాయంత్రం 4.30 గంటలకు స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చి, ట్యూషన్‌కి వెళ్తాను అని చెప్పి స్కూల్‌ బ్యాగ్‌తో పాటు కొన్ని దుస్తులు తీసుకొని 5 గంటల సమయంలో బయటకు వెళ్లిపోయాడు. అయితే అదే ట్యూషన్‌కి వెళ్లే అతని సోదరి తెలిపిన వివరాల ప్రకారం, వెంకటేష్‌ అక్కడికి రాలేదని తెలిసింది.

ఇదే తరగతిలో చదువుతున్న అతని స్నేహితుడు రామేశ్వరం సాయి స్వదీప్‌ కూడా ట్యూషన్‌కి వెళ్తా అంటూ ఇంటి నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి రాలేదు. ఇద్దరూ ఒకరితో ఒకరు స్నేహితులుగా ఉండటంతో కలిసి వెళ్లి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తు ప్రారంభం చుట్టుపక్కల గాలించినా వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు మధాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు బాలురు ఎక్కడికి వెళ్లారో తెలుసుకునేందుకు సీసీ కెమెరా ఫుటేజీలను సేకరిస్తున్నారు. ఇద్దరు బాలుర వివరాలు ఇలా ఉన్నాయి వెంకటేష్‌ ఎత్తు 5.8 అడుగులు, తెలుపు చర్మం, తెలుగు, హిందీ మాట్లాడగలడు. స్వదీప్‌ ఎత్తు 5.2 అడుగులు, తెలుపు చర్మం, తెలుగు, ఇంగ్లీష్‌ మాట్లాడగలడు. వారిద్దరి ఆచూకీ తెలిసిన వారు మధాపూర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు,కుటుంబ సభ్యులు కోరారు. ఇద్దరు బాలుర అదృశ్యంపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని మధాపూర్ పోలీసులు తెలిపారు.