calender_icon.png 16 October, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడండి

15-10-2025 10:51:29 PM

ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతి..

హన్మకొండ (విజయక్రాంతి): గత సంవత్సరం మార్చి నుండి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు,ఉపాధ్యాయులకు ప్రభుత్వము నుండి ఎలాంటి ప్రయోజనాలు అందలేదని, సంవత్సరంన్నర కాలం గడిచినప్పటికీ పెన్షన్ తప్ప తమకు రావలసిన జీపీఎఫ్, టీఎస్జీఎల్ఎస్సీ, జీఐఎస్, లీవ్ ఇన్ క్యాస్మెంట్ కమ్యుటేసన్, గ్రాట్యుటీ మొదలగు ఎలాంటి ప్రయోజనాలు అందకపోవడంతో మానసిక క్షోభకు గురి అవుతున్నామని రిటైర్డు ఉద్యోగ, ఉపాధ్యాయులు అన్నారు.

కొంతమంది మనోవేదనతో అసువులు బాసిన వాళ్లు కూడా ఉన్నారని అన్నారు. బకాయిల సాధన కమిటీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా బుధవారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు అందించారు. వెంటనే తమ రిటైర్డ్ బెనిఫిట్స్ ఇచ్చి, తమ ఆత్మగౌ రవాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు శ్రీదర్ల ధర్మేంద్ర, ప్రధాన కార్య దర్శి కడారి భోగేశ్వర్, అసోసియేట్ అధ్యక్షులు కె. దేవదాస్, ఎండీ గఫార్, కార్యదర్శులు మెకిరి దామోదర్, ఆర్వీ చలం, పీ అశోక్ కుమార్, శ్యామ్ రావు, బీ.సారయ్య, రాజేందర్, బీ. వెంకటేశ్వర్లు, ఎస్.శ్యామ్ సుందర్ రెడ్డి, సంజీవ రెడ్డి, గణపతి, ఐత రవీందర్ పాల్గొన్నారు.