23 June, 2026 | 7:12 PM

Breaking News

పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •   పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ   •   విద్యార్థులకు స్ఫూర్తి… నోటుబుక్స్ పంపిణీతో ఆనందం   •   ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య... నాణ్యమైన భోజనం   •   రైతుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం: మీడకంటి వెంకటరెడ్డి   •   జర్నలిస్ట్ రాఘవేంద్రపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి   •  

ఇద్దరు దొంగల అరెస్ట్

07-07-2024 12:05 AM

రూ. 27 లక్షల విలువైన 300 గ్రాముల ఆభరణాలు స్వాధీనం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి) : వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలతో పాటు వాటిని కొనుగోలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం టోలీచౌకి బృందావన్ కాలనీ మోడరన్ కేఫ్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టిన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు అనుమానితులు పారిపోవడానికి ప్రయత్నించారు. గమనించిన ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుల్ జనార్ధన్‌లు వెంబడించి వారిని పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని తమదైన పద్ధతిలో విచారించగా, పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో 10కి పైగా చోరీలకు పాల్పడినట్లు, నిందితులపై గతంలోనూ పలు కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆసీఫ్‌నగర్‌కు చెందిన సయ్యద్ అలీ హుజైఫా (20), మహమ్మద్ అజ్మల్ షరీఫ్ (19), కొనుగోలుదారు బహదుర్‌పురకు చెందిన మహ్మద్ అబిద్ బియాబానీ(19)లను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ. 27 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు, ఒక బైక్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.