04-06-2025 12:00:00 AM
అదిలాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణంలో ఎలక్ట్రికల్ వాహనంలో చెలరేగిన మంటలతో ప్రమాదవశా త్తు రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యా యి. శివాజీ చౌక్‌లోని శ్రీ సంకట మోచన్ విజయ హనుమాన్ ఆలయం ముందు విజ య్ కేతాన్ అనే వ్యక్తి తన ఎలక్ట్రికల్ స్కూటీ ని పార్కింగ్ చేయగా మంగళవారం షార్ట్ సర్క్యూట్ ఒక్కసారిగా వాహనంలో మంట లు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో పక్కనే పార్కింగ్ చేసి ఉన్న యాక్టివా వాహనంకు సైతం మం టలు అంటుకోగా అది సైతం దగ్ధమైంది. మిగతా వాహనాలకు మం టలు అంటుకోకుండా స్థానికులు స్పందించి మంటలను ఆర్పేశారు. ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.