తొర్రూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి...
మహబూబాబాద్ (విజయక్రాంతి): తొర్రూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని, పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయడం జరుగుతుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(MLA Yashaswini Reddy) అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీకి కొత్తగా సమకూర్చిన పారిశుద్ధ్య వాహనాలు, ట్యాంకర్లను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రోజురోజుకు విస్తరిస్తున్న తొర్రూరు పట్టణానికి తగ్గట్టుగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్తగా సమకూర్చిన వాహనాలతో పట్టణంలో తాగునీటి ఇబ్బంది, పారిశుద్ధ్య నిర్వహణకు తోడ్పడుతాయని చెప్పారు. మున్సిపల్ సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని, అలాగే పట్టణ ప్రజలు కూడా పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.






