8 June, 2026 | 3:38 AM

ఎండ వేడికి ద్విచక్రవాహనం దగ్ధం!

08-06-2026 01:29 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విజయనగరంలో ఘటన 

మణుగూరు, జూన్ 7(విజయక్రాంతి) : ఎండ వేడిమి కారణంగా ఆదివారం మధ్యాహ్నం సీఎప్పీ సమీపంలో ఓ ద్విచక్ర వాహనం నుంచి మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు విజయనగరం గ్రామంలోని ప్రేమ్ కుమార్‌కు చెందిన పల్సర్ ఎన్‌ఎస్ 200 బైక్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

తన బండిలో నుంచి మంటలు రావడాన్ని గమనించిన ప్రేమ్ కుమార్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని అక్కడే వదిలి పరుగులు తీశారు.స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.అయితే అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట కలిగించింది.