బాధ్యతలు స్వీకరించిన అధికారులు
08-06-2026 01:30 AM
మహబూబాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా నియమితులైన ఆర్డిఓ ఎం. రాజేశ్వరి, జీ.సీ.ఈ.ఓ యద్దనపూడి గాయత్రి బాధ్యతలు స్వీకరించారు. మహబూబాబాద్ ఆర్డివోగా విధులు నిర్వహించిన కృష్ణవేణి ములుగు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఖమ్మం నుండి రాజేశ్వరి బదిలీపై వచ్చారు. అలాగే విద్యాశాఖలో జీసీఈవోగా విధులు నిర్వహించిన విజయ కుమారి డిప్యూటేషన్ ముగిసిపోవడంతో ఆమె స్థానంలో నూతనంగా గాయత్రి నియమితులయ్యారు.






